

నేటి భారత్ న్యూస్- గత రెండు సెషన్లుగా లాభాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఉదయం ఓ మోస్తరు లాభాల్లో కదలాడిన సూచీలు చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 7 పాయింట్ల నష్టంతో 74,332కి పడిపోయింది. నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 22,552 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:రిలయన్స్ (3.18%), నెస్లే ఇండియా (1.62%), టాటా మోటార్స్ (1.36%), అదానీ పోర్ట్స్ (0.81%), టాటా స్టీల్ (0.80%).టాప్ లూజర్స్:జొమాటో (-3.82%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.53%), ఎన్టీపీసీ (-2.49%), ఇన్ఫోసిస్ (-1.60%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.55%).