నేటి భారత్ న్యూస్- సినీ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్ తదితర భారీ తారాగణం నటిస్తుండటంతో... ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తూ విష్ణు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ అభిమాని మంచు కుటుంబంలో నెలకొన్న వివాదంపై ప్రశ్నించాడు. మాకు కూడా సమాధానం చెప్పేంత మంచి మనసు నీది... అలాంటిది ఆరోజు జనరేటర్ లో షుగర్ ఎందుకు పోశావు అన్నా? అని ప్రశ్నించగా... ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివానని విష్ణు సరదాగా సమాధానం ఇచ్చారు. తమ ఇంటి వద్ద కరెంట్ సరఫరా నిలిచిపోవడానికి జనరేటర్ లో విష్ణు పంచదార పోశాడని మంచు మనోజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై విష్ణును ఓ అభిమాని ప్రశ్నించాడు.