నిజాంపేట,మెదక్ జిల్లా,ఫిబ్రవరి 23, ( నేటి భారత్ దినపత్రిక ) : నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామ శివారులో గల జడ్ చెర్వు లో అక్రమంగా చేపలు పడుతున్నా వారిపై మండల పోలీస్ స్టేషన్ లో గ్రామ మత్స్యకారుల ముదిరాజ్ సంఘం సభ్యులు పిర్యాదు చేశారు,ఈ సందర్భంగా మత్స్యకారుల ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ బచ్చురాజు పల్లి పరిధిలో గల జెడ్ చెరువులో కొందరు వ్యక్తులు అక్రమంగా చేపలు పడుతున్నారని వారికి చేపలు పట్టవద్దని అనేకసార్లు చెప్పిన వినటం లేదని వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నిజాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు,ఈ చెరువులో చేపలు పట్టే హక్కు మత్స్యకారులకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్,దుర్గోళ్ల రాజు,చంద్రశేఖర్,శ్రీను,రవి,మల్లేశం,లింగం,చంద్రం,స్వామి గ్రామ మత్స్యకార సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.