అత్తగారింటికి, తన భూములున్న ప్రాంతానికి రేవంత్ రెడ్డి రోడ్డు వేసుకుంటున్నారు: హరీశ్ రావు

నేటి భారత్ న్యూస్- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్తగారిల్లు, ఆయన భూములు ఉన్న ఆమన్‌గల్‌కు రూ. 5 వేల కోట్లతో రోడ్డు ఎలా వేస్తున్నారో చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుబంధు ఇచ్చేందుకు డబ్బులు లేవని పదేపదే చెబుతున్నారని, కానీ హెచ్ఎండీఏలో రూ. 20 వేల కోట్లతో టెండర్లు ఎలా పిలుస్తున్నారని ఆయన నిలదీశారు. రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్టేసి ముఖ్యమంత్రి మోసం చేశారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో రుణమాఫీపై ప్రశ్నిస్తే ప్రతిదాడులు, సస్పెన్షన్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ సహా వివిధ హామీలపై కాంగ్రెస్ నేతలను రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. వడగండ్ల వాన వల్ల రైతులందరూ నష్టపోయారని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేలు నష్టపరిహారం చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. శాసనసభను వేదిక చేసుకొని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

నేటి భారత్ న్యూస్- ప్రస్తుతం ఆన్ లైన్ లో బ్యాంకింగ్ వ్యవహారాలకు అవకాశం ఉన్నా, చాలామంది ప్రజలు బ్యాంకుల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అలాంటి వారు బ్యాంకులకు సెలవులు ఎప్పుడు వస్తాయన్నది ఓ అవగాహనతో ఉండడం మంచిది. కాగా, ఏప్రిల్…

 తెనాలిలో స‌మంత‌కు గుడి క‌ట్టిన అభిమాని.

నేటి భారత్ న్యూస్- త‌మ అభిమాన న‌టీన‌టుల‌పై ఫ్యాన్స్ చూపించే ప్రేమ‌ను మాట‌ల్లో చెప్ప‌లేం. కోలీవుడ్‌లోనైతే అభిమానులు త‌మ అభిమాన క‌థానాయిక‌ల‌కు ఏకంగా గుళ్లు క‌ట్టించిన దాఖ‌లాలు ఉన్నాయి. ఇదే కోవ‌లో తాజాగా ఓ తెలుగు అభిమాని హీరోయిన్ స‌మంత‌కు గుడి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

 తెనాలిలో స‌మంత‌కు గుడి క‌ట్టిన అభిమాని.

 తెనాలిలో స‌మంత‌కు గుడి క‌ట్టిన అభిమాని.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ర‌వీంద్ర‌ జ‌డేజా అరుదైన రికార్డ్‌.. తొలి ప్లేయ‌ర్‌గా ఘ‌న‌త‌!

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ర‌వీంద్ర‌ జ‌డేజా అరుదైన రికార్డ్‌.. తొలి ప్లేయ‌ర్‌గా ఘ‌న‌త‌!

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భానుడి ఉగ్రరూపం… ఐఎండీ అప్ డేట్

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భానుడి ఉగ్రరూపం… ఐఎండీ అప్ డేట్

ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కి.మీ. పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ కారు.. త్వరలో మార్కెట్లోకి తేనున్న మారుతి సుజుకీ

ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కి.మీ. పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ కారు.. త్వరలో మార్కెట్లోకి తేనున్న మారుతి సుజుకీ

విమానంలో బీడీ తాగుతూ ప‌ట్టుబ‌డ్డ ప్ర‌యాణికుడు

విమానంలో బీడీ తాగుతూ ప‌ట్టుబ‌డ్డ ప్ర‌యాణికుడు