

నేటి భారత్ న్యూస్- అనకాపల్లి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. దేవరాపల్లి గ్రామం వద్ద పొలాల్లో 15 అడుగుల కింగ్ కోబ్రా రైతులను భయభ్రాంతులకు గురిచేసింది. పొలాల్లోకి వచ్చిన ఆ భారీ విషసర్పాన్ని కుక్కలు నిలువరించాయి. దాంతో ఆ పాము పక్కనే ఉన్న చెట్లలోంచి చూస్తున్న రైతులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాంతో వారు భయంతో పరుగులు తీశారు. అనంతరం ఆ పాము అక్కడ్నించి వెళ్లిపోయింది.