ఆఫ్ఘ‌నిస్థాన్ చేతిలో ఓట‌మి.. ఏడ్చేసిన జో రూట్‌..

నేటి భారత్ న్యూస్- ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నిన్న‌ ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆఫ్ఘ‌నిస్థాన్ చేతిలో బ‌ల‌మైన ఇంగ్లీష్ జ‌ట్టు పరాజ‌యం పాలైంది. ఎనిమిది ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌ జ‌ట్టును ఓడించింది. ఆఖ‌రి వ‌ర‌కు ఇంగ్లండ్ గెలుపు ఖాయ‌మ‌నే అంద‌రూ అనుకున్నారు. కానీ, చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో ఆఫ్ఘాన్‌ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ను క‌ట్ట‌డి చేయ‌డంతో మ్యాచ్ మ‌లుపు తిరిగింది. ఇంకా చెప్పాలంటే ఆఫ్ఘనిస్థాన్ బౌల‌ర్లు మ్యాజిక్ చేసి, మ్యాచ్ స్వరూపమే మార్చేశారు. దాంతో టోర్నీలో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో జాస్ బ‌ట్ల‌ర్ సేన ఓట‌మి చ‌విచూసింది.  ఈ ప‌రాజ‌యంతో ఇంగ్లండ్ ఇంటిముఖం ప‌ట్టింది. 326 పరుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆ జ‌ట్టు 317 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో జో రూట్ శ‌తకం (120) చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. చాలా ఓపిక‌గా బ్యాటింగ్ చేసిన రూట్‌.. చివ‌రి వ‌ర‌కు జ‌ట్టును గెలిపించేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ, అత‌ను ఔటైన త‌ర్వాత మ్యాచ్ చేజారింది. దాంతో మ్యాచ్ ఓడిపోయిన త‌ర్వాత స్టార్ బ్యాట‌ర్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌