ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులు… నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నేటి భారత్ న్యూస్-అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు (మార్చి 8) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పలు పథకాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో తీసుకువచ్చిన ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ఆవిష్కరించనున్నారు. డ్వాక్రా సంఘాల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.ఇక, ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులను ప్రారంభించనున్నారు. అటు, మహిళలే నిర్వహించేలా 31 జిల్లాల్లో పెట్రోల్ బంకులు ప్రారంభించేందుకు చమురు సంస్థలతో నేడు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేయనున్నారు. 400 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.40 కోట్ల ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేస్తారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్