ఆ గిరిజన గ్రామస్తులకు డోలీ బాధలు తప్పాయి

నేటి భారత్ న్యూస్- శ్రీకాకుళం జిల్లా హిర మండల పరిధిలోని పెద్దగూడ పంచాయతీ గిరిజన గ్రామస్తులకు ఇక డోలీ బాధలు తొలగిపోయాయి. పెద్దగూడ పంచాయతీలో తొమ్మిది గిరిజన గ్రామాలు ఉండగా, అవన్నీ ఎత్తయిన కొండ ప్రాంతంలో ఉంటాయి. ఈ గ్రామాలకు ఇంతవరకు పక్కా రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో అనారోగ్యంతో బాధపడేవారిని, గర్బిణులను డోలీల్లో నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు మండలం గొట్టిపల్లి గ్రామానికి చేర్చేవారు. ఈ గ్రామస్తుల సమస్య శాశ్వత పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం .. పెద్దగూడ పంచాయతీ కేంద్రానికి పక్కా రహదారి ఏర్పాటుకు రూ.1.50 కోట్లు మంజూరు చేయగా, ఇటీవల ఐటీడీఏ ఇంజనీర్లు సీసీ, తారు రోడ్డు పనులు పూర్తి చేశారు. కాగా, ఆదివారం గ్రామానికి చెందిన గర్బిణి సవర సఖియక అనే మహిళ ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతుండటంతో 108కి గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని కొత్తగా వేసిన రహదారి మీదుగా గర్బిణిని 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు ఆసుపత్రికి నిమిషాల వ్యవధిలో తరలించారు. గ్రామానికి తొలిసారి అంబులెన్స్ రావడంతో తమకు ఇకపై డోలీ బాధలు తప్పాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌