

నేటి భారత్ న్యూస్-‘‘మూడేళ్ల తర్వాత అధికారం మనదే. అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా, అప్పటి వరకు ధైర్యంగా ఉండు’’ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అభయమిచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు రెండ్రోజుల క్రితం పులివెందుల పోలీసులు పవన్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ‘వైఎస్ అవినాశ్ అన్న యూత్’ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న పవన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.ఈ నేపథ్యంలో నిన్న పులివెందులలో పర్యటించిన జగన్‌ను పవన్ కుమార్ కలిశారు. విచారణ పేరుతో డీఎస్పీ, సీఐ తనను కొట్టారంటూ ఫిర్యాదు చేశారు. స్పందించిన జగన్ ఆయనను ఓదార్చారు. మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో సెల్యూట్ కొట్టిస్తానని, అంతవరకు ధైర్యంగా ఉండాలని కోరారు. కాగా, నేడు మరోమారు విచారణకు రావాలంటూ పవన్‌కుమార్‌కు పోలీసులు ఇప్పటికే 41ఏ నోటీసులు ఇచ్చారు.