ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

చెన్నైలో త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ డీలిమిటేష‌న్ మీటింగ్‌కు ఏపీ నుంచి జ‌న‌సేన పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు హాజ‌రైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఈ స‌మావేశంలో జ‌న‌సేన త‌ర‌ఫున ఎవ‌రు హాజ‌రుకాలేదు. ఇదే విష‌య‌మై జ‌న‌సేన పార్టీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేకంగా ఒక లేఖ‌ను విడుద‌ల చేసింది. తాము సీఎం స్టాలిన్ నిర్వ‌హించిన‌ డీలిమిటేష‌న్ మీటింగ్‌కు హాజ‌రైన‌ట్లు వ‌స్తున్న వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మేన‌ని ఈ లేఖ ద్వారా స్ప‌ష్టం చేసింది. ఈ అఖిల‌ప‌క్ష స‌మావేశానికి హాజ‌రు కావాల్సిందిగా ఆహ్వానం అందింద‌ని, కానీ తాము హాజ‌రు కాలేమ‌ని స‌మాచారం అందించిన‌ట్లు పేర్కొంది. వేర్వేరు కూటములుగా ఉన్నందున స‌మావేశంలో పాల్గొన‌డం కూద‌ర‌ద‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా తెలియ‌జేయాల‌ని త‌మ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచ‌న మేర‌కు వారికి స‌మాచారం ఇచ్చిన‌ట్లు జ‌న‌సేన పేర్కొంది. ఇక డీలిమిటేష‌న్ పై వారికి ఒక అభిప్రాయం ఉన్న‌ట్లే, త‌మ‌కు ఓ విధానం ఉంద‌ని, ఈ విష‌యాన్ని స‌రైన వేదిక‌పై వెల్ల‌డిస్తామ‌ని లేఖ‌లో పేర్కొన‌డం జ‌రిగింది. ఇదిలాఉంటే… కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన డీలిమిటేష‌న్ ను త‌మిళ‌నాడులోని డీఎంకే ప్ర‌భుత్వం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. 2026 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం నియోజ‌కవ‌ర్గాల పూనర్విభజనను అంగీక‌రించ‌డం లేదు. ఇదే విష‌య‌మై జాతీయ స్థాయిలో ఉద్య‌మించేందుకు స్టాలిన్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందుకోసం ద‌క్షిణాది రాష్ట్రాల ప్ర‌జా ప్ర‌తినిధుల మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు చెన్నైలో అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రైన విష‌యం తెలిసిందే.    

Related Posts

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

నేటి భారత్ న్యూస్- ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని… మొత్తం 175 సీట్లలో 164 సీట్లను కట్టబెట్టి ఘన విజయం అందించారని చెప్పారు. కూటమికి 21 ఎంపీ స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా…

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

నేటి భారత్ న్యూస్- లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని, డీలిమిటేషన్‌ను ప్రశ్నించని పక్షంలో చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ