ఆ విషయంలో ట్రంప్ కంటే బైడెన్‌యే బెటర్‌!

నేటి భారత్ న్యూస్- అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ఈ అంశం భారత పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది. అమెరికా ప్రభుత్వం మరో 295 మంది భారతీయ అక్రమ వలసదారులను వెనక్కి పంపనుంది. వీరంతా ప్రస్తుతం తమ నిర్బంధంలో ఉన్నారని, త్వరలో వారిని తిరిగి పంపించివేస్తామని అమెరికా అధికారులు తెలిపినట్లు కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం రాజ్యసభకు తెలియజేసింది. సీపీఐ సభ్యుడు జాన్ బ్రిటన్ దీనిపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 2009 నుండి 2024 వరకు అమెరికా సర్కారు అక్రమ వలసదారులను పంపిన వివరాలను విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్రమ వలసదారులను వెనక్కి పంపించే ప్రక్రియ ట్రంప్‌కు ముందే మొదలైందని, 2009 నుంచి 2024 మధ్యకాలంలో 15,564 మందిని వెనక్కి పంపారని తెలిపింది. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో 6 వేల మంది భారతీయులను అక్రమ వలసదారులుగా గుర్తించి పంపించేశారు. బైడెన్ హయాంలో అదే తరహాలో 3,652 మంది భారతీయ అక్రమ వలసదారులను తిరిగి పంపించారని విదేశాంగ శాఖ వివరించింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 388 మందిని వెనక్కి పంపగా, మరో 295 మంది బహిష్కరణకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, భారతీయ అక్రమ వలసదారులను సంకెళ్లు వేసి అమానుషంగా ట్రంప్ సర్కారు తరలించిన అంశం వివాదాస్పదమైంది. విపక్షాలు, భారత ప్రభుత్వం దీనిపై నిరసన వ్యక్తం చేశాయి. పై గణాంకాలను బట్టి చూస్తే, అక్రమ వలసదారులను వెనక్కి పంపించే విషయంలో ట్రంప్ కంటే బైడెన్ సర్కారే బెటర్ అన్న అభిప్రాయాలు భారతీయుల నుంచి వినిపిస్తున్నాయి. 

Related Posts

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

నేటి భారత్ న్యూస్- ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని… మొత్తం 175 సీట్లలో 164 సీట్లను కట్టబెట్టి ఘన విజయం అందించారని చెప్పారు. కూటమికి 21 ఎంపీ స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా…

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

నేటి భారత్ న్యూస్- లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని, డీలిమిటేషన్‌ను ప్రశ్నించని పక్షంలో చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ