ఇండియాకు స్టార్‌లింక్.. మస్క్ స్పేస్ఎక్స్‌తో జియో ఒప్పందం

నేటి భారత్ న్యూస్- ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌ శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు రిలయన్స్ జియో రెడీ అయింది. ఈ మేరకు స్పేస్ఎక్స్‌తో ఒప్పందం చేసుకుంది. స్టార్‌లింక్‌ను భారత్‌లో విక్రయించేందుకు అవసరమైన ఆమోదం పొందడంపై ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుంది. అదే జరిగితే జియో తన స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల ద్వారా స్టార్‌లింక్ సేవలను అందిస్తుంది.  ప్రతి భారతీయుడికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని రిలయన్స్ జియో గ్రూప్ సీఈవో మాథ్యూ ఊమెన్ తెలిపారు. అంతరాయాల్లేని నెట్‌వర్క్ కోసం స్పేస్ఎక్స్ స్టార్‌లింక్‌ను భారత్‌కు తీసుకురావడం కీలక ముందడుగని అన్నారు.  ఈ భాగస్వామ్యం వల్ల భారతదేశం అంతటా, మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర ఆపరేటర్ల కంటే ఎక్కువ మొబైల్ డేటాను నిర్వహించే జియో.. తన ఇంటర్నెట్ సేవలను బలోపేతం చేయడానికి స్టార్‌లింక్ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను వాడుకుంటుంది. స్టార్‌లింక్ వినియోగదారుల కోసం ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్, కస్టమర్ సపోర్ట్ కోసం జియో ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనుంది.  ఈ ఒప్పందం ద్వారా జియో ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ లైనప్‌కు జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్‌లకు స్టార్‌లింక్ నెట్‌వర్క్ జోడిస్తారు. ఫలితంగా అతి తక్కువ సమయంలో అత్యంత క్లిష్టమైన ప్రదేశాలను కూడా ఇది కవర్ చేస్తుంది. భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ను అందించేందుకు స్పేస్ఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఎయిర్‌టెల్ చెప్పిన ఒక్క రోజులోనే జియో ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పెరుగుతున్న పోటీకి దీనిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్