ఇజ్రాయెల్ టూరిస్ట్ పై కర్ణాటకలో గ్యాంగ్ రేప్

నేటి భారత్ న్యూస్- భారత పర్యటనలో భాగంగా కర్ణాటకకు వచ్చిన ఇజ్రాయెల్ పౌరురాలు సామూహిక అత్యాచారానికి గురైంది. తనకు ఆశ్రయం ఇచ్చిన అతిథి గృహం యజమానురాలితో పాటు మరికొందరు టూరిస్టులతో కలిసి స్టార్ గేజింగ్ (నక్షత్రాలను పరిశీలించడం) కు వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తులు వారిపై దాడి చేశారు. ఓ కాలువ ఒడ్డున కూర్చుని ఉన్న టూరిస్టులలోని పురుషులను ముందుగా కాలువలోకి తోసేశారు. అనంతరం ఇజ్రాయెల్ టూరిస్టుతో పాటు అతిథి గృహం యజమానిపై అత్యాచారం చేసి పారిపోయారు. బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలోని కొప్పల్ లో చోటుచేసుకుందీ ఘోరం.బాధితులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొప్పల్ కు చెందిన 29 ఏళ్ల మహిళ హోమ్ స్టే నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తూ ఆదాయం పొందుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇజ్రాయెల్ నుంచి ఓ మహిళ, అమెరికా నుంచి వచ్చిన డేనియల్ సహా మరో ఇద్దరికి ఆశ్రయం కల్పించింది. గురువారం రాత్రి టూరిస్టుల అభ్యర్థన మేరకు స్టార్ గేజింగ్ కోసం వారిని సోనాపూర్ సమీపంలోని తుంగభద్ర కెనాల్ ఒడ్డుకు తీసుకెళ్లింది.వారంతా కాలువ ఒడ్డున కూర్చుని నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి దాడి చేశారు. టూరిస్టులలోని ముగ్గురు మగవాళ్లను కాలువలోకి తోసేసి, ఇజ్రాయెల్ పౌరురాలితో పాటు హోమ్ స్టే యజమానిపై అత్యాచారం చేసి పారిపోయారు. కాలువలో పడ్డ డేనియల్, మరో టూరిస్టు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మరో టూరిస్టు కాలువలో గల్లంతయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన టూరిస్టు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్