

నేటి భారత్ న్యూస్- సాధారణంగా ఎక్స్ ప్రెస్ రైళ్లకు పాతిక, గూడ్సు రైళ్లకు 40 నుంచి 60 బోగీలు ఉంటాయి. కానీ ఈ రైలుకు ఏకంగా 295 బోగీలు ఉన్నాయి. వందల సంఖ్యలో బోగీలతో కూడిన ఈ రైలు ఎంత పొడవుందో తెలుసా… 3.5 కిలోమీటర్లు! ఈ రైలు పేరు సూపర్ వాసుకి. ఇది 25,962 టన్నుల సరకు రవాణా చేయగలదు. ముఖ్యంగా దీన్ని బొగ్గు రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఈ సూపర్ వాసుకి రైలు ఇంజిన్ కూడా చాలా పవర్ ఫుల్. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.