ఇసుక రవాణా కోసం కృష్ణా నదిలో ఏకంగా రోడ్డు వేసిన మాఫియా

నేటి భారత్ న్యూస్- తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పూట ఇసుక తవ్వుతూ దానిని కర్ణాటకకు తరలించేందుకు ఏకంగా రాత్రికిరాత్రే కృష్ణానదిలో ఓ రోడ్డు నిర్మించింది. కోట్లాది రూపాయల ఈ దందా నిరాటంకంగా సాగిపోతోంది. నదిలో ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి మరీ ఇసుకను తరలిస్తున్నా అధికారులు మాత్రం అటువైపు తొంగిచూడడం లేదు. నారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలంలో కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నదికి ఇటువైపు కృష్ణా, వాసునగర్, ముడుమాల్, పస్పుల, అంకెన్‌‌‌‌పల్లి, టైరోడ్‌ ప్రాంతాలు ఉండగా.. అవతలివైపు కర్ణాటక రాష్ట్రానికి చెందిన గంజిపల్లి, దేవసూగూరు, కొర్తికొండ, ఆత్కూరు గ్రామాలు ఉన్నాయి. తెలంగాణలోని టైరోడ్డు సమీపంలో కృష్ణా నదిలో ఇసుక అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి. నదిలో నీళ్లు లేకపోవడంతో టైరోడ్డు నుంచి కర్ణాటక వైపు వెళ్లేందుకు అక్రమార్కులు ఏకంగా నదిలోనే మట్టిరోడ్డు నిర్మించారు. అక్కడక్కడా స్వల్పంగా నీటి ప్రవాహం ఉండడంతో చిన్న చిన్న తూములు ఏర్పాటు చేసి మరీ రోడ్డేశారు. సుమారు 8 కిలోమీటర్ల మేర రోడ్డు వేసి రాత్రిపూట టిప్పర్లతో యథేచ్చగా ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాల కారణంగా నదిలో ఎక్కడ చూసినా గోతులే కనిపిస్తున్నాయి. నది ఒడ్డున పెద్ద సంఖ్యలో ఇసుక డంపులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నదిలో రోడ్డు నిర్మించి మరీ ఇసుక తరలిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందని, అందువల్లే అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్