ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం.. కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ అంగీకారం

నేటి భారత్ న్యూస్– రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. జెడ్డాలోని ఒర్నాట్ హోటల్‌లో దాదాపు 9 గంటలపాటు జరిగిన చర్చల అనంతరం ఈ ప్రతిపాదనకు కీవ్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌కు మిలటరీ సాయం నిలిపివేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా దానిని పునరుద్ధరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాల్పుల విరమణకు కీవ్‌పై ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ఉక్రెయిన్ దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధికారులు సౌదీ అరేబియాలో చర్చలకు మొగ్గు చూపడం ద్వారా రాజీకి ఆసక్తి కనబరిచారు. వైమానిక, సముద్ర దాడులపై పాక్షిక సంధిని ప్రతిపాదించారు. వేలాదిమందిని బలిగొన్న యుద్ధానికి నెల రోజుల పాటు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ప్రతిపాదనకు కీవ్ అంగీకరించినట్టు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. ‘‘మేమొక ఆఫర్‌ను తీసుకొచ్చాం. ఉక్రెయిన్ అందుకు అంగీకరించింది. కాల్పుల విరమణ పాటించడంతోపాటు తక్షణ చర్యలకు ముందుకొచ్చింది’’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. చర్చలకు ఉక్రెయిన్ దిగొచ్చిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీనికి అంగీకరిస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్