

నేటి భారత్ న్యూస్– ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. మొత్తం 14 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. సంస్థ తాజా నిర్ణయంతో ఏడాదికి రూ. 210 కోట్ల నుంచి రూ. 360 కోట్ల వరకు ఆదా అవుతాయని భావిస్తోంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. తొలగింపులన్నీ మేనేజర్ స్థాయిలోనే ఉంటాయని సమాచారం. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమెజాన్ ఇటీవల కమ్యూనికేషన్స్, సస్టెయిన్‌బిలిటీ విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరో 14 వేల మందిపై వేటుకు రంగం సిద్ధం చేసింది. 2022, 2023 సంవత్సరాల్లో అమెజాన్ ఏకంగా 27 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.