

నేటి భారత్ న్యూస్- అప్పట్లో సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కేసులో విచారణ ఎట్టకేలకు ముగిసింది. 2009 డిసెంబరు 7న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ కోర్టు మే 6న తీర్పు వెలువరించనుంది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్, అలీ ఖాన్, బి.కృపానందం నిందితులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ఆమెపై ఉన్న కేసును 2022లో హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ 219 మంది సాక్షులను విచారించింది. 3,337 డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంది. 2011 డిసెంబరులో సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. 9 మంది నిందితులపై 4 చార్జిషీట్లు నమోదు చేసింది. లింగారెడ్డి అనే నిందితుడు కేసు విచారణలో ఉండగా మరణించాడు.