ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం: మృతదేహాలను గుర్తించినా బయటికి తీసేందుకు అడ్డంకిగా మెషీన్ భాగాలు

నేటి భారత్ న్యూస్- నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ నుంచి తీసుకువచ్చిన కడావర్ డాగ్స్ మృతదేహాలను గుర్తిస్తున్నప్పటికీ, ఆ మృతదేహాలను వెలికితీయడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. మృతదేహాలు బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, టన్నెల్ బోరింగ్ మెషీన్ భాగాలు అడ్డుగా ఉండడంతో, మృతదేహాలను బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. ఇప్పటివరకు గురుప్రీత్ సింగ్ అనే మెషీన్ ఆపరేటర్ మృతదేహాన్ని వెలికితీశారు. నిన్న మరో రెండు మృతదేహాలు గుర్తించారు. ఈ నేపథ్యంలో, అడ్డుగా ఉన్న మెషీన్ భాగాలను రెస్క్యూ టీమ్ సిబ్బంది గ్యాస్ కట్టర్లతో తొలగిస్తున్నారు.  సహాయక చర్యలు నేటికి 18వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ ప్రత్యేకంగా రోబోలను కూడా రంగంలోకి దించినట్టు  తెలుస్తోంది. టన్నెల్ లో మరింత ముందుకుపోయేకొద్దీ సహాయక చర్యల సిబ్బంది ప్రాణాలకు కూడా ముప్పు ఉండడంతో రోబోలను తీసుకువచ్చారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్