ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

నేటి భారత్ న్యూస్- ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడూ ప్రజల్లో తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. ఐదేళ్ల పాలన తర్వాత పది లక్షల కోట్ల అప్పును మిగిల్చి వెళ్లిందని వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈమేరకు శనివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించారు. తణుకులో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.  గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ ఏనాడైనా ప్రజల్లో తిరిగారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కార్లలో వస్తే రోడ్డు పక్కన పరదాలు కట్టించేవారు, విమానంలో రావాలంటే లెక్కలేనన్ని చెట్లను నరికించే వారు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా నోరు మెదపనిచ్చే వారే కాదని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశమే ఇవ్వలేదని తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలు వినేందుకే ఈ పర్యటన చేపట్టానని చంద్రబాబు తెలిపారు.

Related Posts

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌

నేటి భారత్ న్యూస్-బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇసుక మాఫీయాపై వ‌స్తున్న వార్త‌ల ప‌ట్ల ఆయ‌న ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా స్పందించారు. ఈ…

భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్

నేటి భారత్ న్యూస్- ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (ఐఎంఎల్) 2025 విజేతగా భారత్ అవతరించింది. సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని భారత మాస్టర్స్ జట్టు ఫైనల్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌

భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్

భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్

 తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం

 తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం

బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!

బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!

మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్

మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్

అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..

అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..