

నేటి భారత్ న్యూస్- ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. పొత్తు ప్రకారం టీడీపీ మూడు స్థానాలకు పోటీ చేస్తుండగా… జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి కేటాయించారు. తాజాగా బీజేపీ టికెట్ పై పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. కాగా, కూటమి అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీడీపీ నుంచి బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు పోటీ చేస్తుండగా… జనసేన నుంచి నాగబాబు అవకాశం దక్కించుకున్నారు. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.