ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘ‌న‌త‌.. తొలి జ‌ట్టుగా న‌యా రికార్డ్!

నేటి భారత్ న్యూస్-ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) అరుదైన ఘ‌న‌త సాధించింది. గురువారం స‌న్‌రైజ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 80 ప‌రుగుల తేడాతో గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో కోల్‌క‌తా జ‌ట్టు ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టోర్నీ చ‌రిత్ర‌లో మూడు జ‌ట్ల‌పై 20 అంత‌కంటే ఎక్కువ విజ‌యాలు సాధించిన టీమ్ గా స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఎస్ఆర్‌హెచ్‌పై 20, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 20, పంజాబ్ కింగ్స్ పై 21 విజ‌యాలు న‌మోదు చేసింది. అలాగే స‌న్‌రైజ‌ర్స్ పై 2023-25 మ‌ధ్య వ‌రుస‌గా 5 మ్యాచుల్లో కోల్‌క‌తా విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ కూడా 2020-23 మ‌ధ్య ఎస్ఆర్‌హెచ్ పై వ‌రుస‌గా ఐదు మ్యాచుల్లో గెలిచింది. కాగా, ఐపీఎల్‌లో ర‌న్స్ ప‌రంగా నిన్న‌టి మ్యాచ్‌లోనే స‌న్‌రైజ‌ర్స్ కు భారీ ప‌రాజ‌యం. ఈ మ్యాచ్ లో 80 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. 

Related Posts

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

నేటి భారత్ న్యూస్- ఆంధప్రదేశ్‌లో రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ నిర్ణయించింది. అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో నెలకొల్పనున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా,…

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

నేటి భారత్ న్యూస్- చైనీయుల‌తో ప్రేమ, పెళ్లి, శారీర‌క‌ సంబంధాలు ఏర్ప‌రుచుకోవ‌ద్ద‌ని అమెరికా చైనాలోని త‌మ‌ ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని హెచ్చ‌రించింది. చైనాలో అమెరికా మిషన్‌ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు, భద్రతాపరమైన అనుమతులున్న కుటుంబ సభ్యుల‌కు ఈ నిషేధం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘ‌న‌త‌.. తొలి జ‌ట్టుగా న‌యా రికార్డ్!

ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘ‌న‌త‌.. తొలి జ‌ట్టుగా న‌యా రికార్డ్!

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!