

నేటి భారత్ న్యూస్- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఈ మెగా టోర్నీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఈ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ 19 సార్లు సున్నాకే వెనుదిరిగాడు. నిన్న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)తో జరిగిన మ్యాచ్‌లో అతడు పరుగుల ఖాతా తెరవకుండానే తొలి బంతికే పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాక్స్‌వెల్ ఖాతాలో ఈ అవాంఛిత రికార్డు చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (18), దినేశ్ కార్తీక్ (18), పియూశ్ చావ్లా (16), సునీల్ నరైన్ (16), రషీద్ ఖాన్ (15), మన్‌దీప్ సింగ్ (15), మనీశ్ పాండే (14), అంబటి రాయుడు (14), హర్భజన్ సింగ్ (13) ఉన్నారు. ఇక మంగళవారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 5వ మ్యాచ్‌లో గుజరాత్‌ను పంజాబ్ 11 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 232 పరుగులే చేసింది. దాంతో చివరి వరకు పోరాడి ఓడింది.