

నేటి భారత్ న్యూస్- ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 26 బంతుల్లోనే 70 పరుగులు చేసి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఈ క్రికెటర్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదాడు. దీంతో అతడు ఐపీఎల్ చరిత్రలో 20 బంతుల్లోపే అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఇప్పటివరకు పూరన్ ఈ ఫీట్‌ను నాలుగు సార్లు సాధించాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌లు చెరో మూడు హాఫ్ సెంచరీలతో సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. ఇక పూరన్ నిన్నటి మ్యాచ్‌లో ఏకంగా 269.23 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. మిచెల్ మార్ష్‌తో కలిసి ఏకంగా 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది లక్నో విజయానికి సహాయపడింది. 70 పరుగులతో పూరన్ ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను ఇప్పటివరకు 145 పరుగులు సాధించగా, మార్ష్ 124 పరుగులతో అతని తర్వాతి స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ను ఎల్ఎస్జీ ని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే.