

నేటి భారత్ న్యూస్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతుల్లో 25 పరుగులు చేసిన జడేజా ఐపీఎల్‌లో 3000 పరుగులు చేసి, 100 కంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ ఇప్పటివరకు 242 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 3001 పరుగులు, 160 వికెట్లు సాధించాడు.ఇక జడ్డూ చెన్నై జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడు. మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత జడేజా ఉన్నాడు. ఈ లీగ్‌లో అతని సగటు 30.76, ఎకానమీ రేటు 7.64తో 160 వికెట్లు పడగొట్టాడు. ఇందులో సీఎస్‌కే తరపున అతను 133 వికెట్లు పడగొట్టడం విశేషం. తద్వారా ఇప్పటివరకు చెన్నై తరఫున అత్యధిక వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో (140) తర్వాత అతడు రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 1000+ పరుగులు, 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్లు వీరే
రవీంద్ర జడేజా – 3001 పరుగులు, 160 వికెట్లు
ఆండ్రీ రస్సెల్ – 2488 పరుగులు, 115 వికెట్లు
అక్షర్ పటేల్ – 1675 పరుగులు, 123 వికెట్లు
సునీల్ నరైన్ – 1578 పరుగులు, 181 వికెట్లు
డ్వేన్ బ్రావో – 1560 పరుగులు, 183 వికెట్లు