ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివాదానికి తెరతీసిన ఆర్సీబీ..

నేటి భారత్ న్యూస్- ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ సరికొత్త వివాదానికి తెరలేపింది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ మార్పును ఎగతాళి చేస్తున్నట్టుగా ఉన్న ఆర్సీబీ వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఆర్సీబీ చిక్కుల్లో పడింది. ముంబై ఇండియన్స్‌కు తిరుగులేని విజయాలు అందించిన రోహిత్ శర్మను కాదని, గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసిన ముంబై ఫ్రాంచైజీ ఏకంగా అతడికి జట్టు పగ్గాలు అప్పగించింది. రోహిత్‌ను కాదని, పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడంపై అభిమానులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా, ఈ సీజన్‌లో కెప్టెన్ డుప్లెసిస్‌ను వదులుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీకి చెందిన ‘మిస్టర్ నాగ్స్’ ముంబై ఇండియన్స్‌ను ట్రోల్ చేశాడు. పటీదార్‌తో మాట్లాడుతూ.. ‘‘మొత్తానికి నువ్వు కెప్టెన్ అయ్యావు. ఆర్సీబీ గత సారథులు విరాట్, డుప్లెసిస్ కూడా నీకు అభినందనలు తెలిపారు. మిగతా జట్లు కూడా కెప్టెన్సీ మార్పు సమయంలో ఇలానే చేశాయని అనుకుంటున్నావా?’’ అని ప్రశ్నించాడు. దీనికి పటీదార్ స్పందిస్తూ.. తనకా విషయాలు తెలియవని ముక్తసరిగా జవాబిచ్చాడు. దీంతో మళ్లీ కల్పించుకున్న నాగ్.. ‘‘నీకు నిజంగా తెలియదా? మరైతే ఎందుకు నవ్వుతున్నావు’’ అని రెట్టించాడు. అక్కడితో ఆగకుండా ‘‘అంటే నీ ఉద్దేశం ముంబై ఇండియన్స్‌కు తెలియదు (ఎంఐ (మై) నహీ జాన్తా) అనే కదా అని అన్నాడు.  ఈ సంభాషణ కాస్తా సోషల్ మీడియాకెక్కడంతో వైరల్ అవుతోంది. ఇది ముంబై కెప్టెన్సీ మార్పును ఎగతాళి చేయడమేనని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీమ్స్‌తో ఆర్సీబీని ఆడుకుంటున్నారు.

Related Posts

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

నేటి భారత్ న్యూస్- ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని… మొత్తం 175 సీట్లలో 164 సీట్లను కట్టబెట్టి ఘన విజయం అందించారని చెప్పారు. కూటమికి 21 ఎంపీ స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా…

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

నేటి భారత్ న్యూస్- లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని, డీలిమిటేషన్‌ను ప్రశ్నించని పక్షంలో చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ