ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కి.మీ. పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ కారు.. త్వరలో మార్కెట్లోకి తేనున్న మారుతి సుజుకీ

నేటి భారత్ న్యూస్- దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారతీయులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ కార్ల విషయంలో బ్యాటరీ మన్నికపై వినియోగదారుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. దీనిని గుర్తించిన ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ మారుతి సుజుకీ సరికొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తాజాగా ప్రకటించింది. ‘ఈ విటారా’ పేరుతో తీసుకొస్తున్న ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించవచ్చని చెబుతోంది. తయారీ తుది దశకు చేరుకుందని, ఈ ఏడాది చివరిలోగా ‘ఈ విటారా’ను మార్కెట్లో విడుదల చేస్తామని ప్రకటించింది. మరోవైపు, భారత్ కు చెందిన టాటా కంపెనీ కూడా ఓ కొత్త ఈవీ కారును తీసుకురానుంది. టాటా హారియర్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ కారులో 75 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ విటారా.. మారుతి సుజుకీ కంపెనీపై భారతీయులలో నమ్మకం ఎక్కువ. వినియోగదారులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ క్రమంలోనే భారత్ లో తమ వినియోగదారుల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ కారు ‘ఈ విటారా’ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ కారులో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. హారియర్భా రతీయ కంపెనీల్లో టాటా కంపెనీ బ్రాండ్ కు సాటిరాగల కంపెనీ మరొకటి లేదనడంలో అతిశయోక్తి ఏమీలేదు. టాటా కార్లలో దాదాపు అన్నింటికీ 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. తాజాగా టాటా నుంచి ‘హారియర్’ పేరుతో ఎలక్ట్రిక్ కారు రానుంది. ఇందులో 75కే డబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!