ఒక ఫ్లైట్ ల్యాండవుతుండగా రన్ వే పైకి మరో విమానం.. తర్వాత ఏం జరిగిందంటే..

నేటి భారత్ న్యూస్- షికాగో విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఒక విమానం ల్యాండవుతున్న సమయంలో రన్వేపైకి మరో విమానం అడ్డంగా రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే తన విమానాన్ని తిరిగి టేకాఫ్ చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం అమెరికాలోని షికాగో విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే.. ఒమాహా నుంచి బయలుదేరిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం మంగళవారం ఉదయం 8:47 గంటలకు షికాగోలోని మిడ్ వే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండవుతోంది. విమానాశ్రయంలోని రన్‌వే 31సీపై దిగుతుండగా ఇదే రన్ వేపై ఛాలెంజర్ 350 ప్రైవేట్ జెట్ అడ్డంగా వెళుతోంది. చివరిక్షణంలో ఈ జెట్ ను గమనించిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం పైలెట్ మళ్లీ టేకాఫ్ తీసుకున్నాడు. దీంతో రెండు విమానాలు ఢీ కొనే ప్రమాదం తప్పింది. రెండో ప్రయత్నంలో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం క్షేమంగా ల్యాండయింది. ఈ ఘటనపై దర్యాఫ్తు చేపట్టిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.. సదరు ప్రైవేట్ జెట్ పైలట్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా రన్ వేపైకి వచ్చాడని ప్రాథమికంగా తేల్చారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌