ఓ వ్యాపారి ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి పన్నాగం.. చిత్తూరు కాల్పుల ఘటనలో భారీ ట్విస్ట్

నేటి భారత్ న్యూస్- చిత్తూరులో బుధవారం ఉదయం కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో సినిమాను మించిన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చిత్తూరు టౌన్ లోని గాంధీరోడ్డులో ఉదయం ఓ వ్యాపారి ఇంట్లోకి దొంగల ముఠా ప్రవేశించింది. గాలిలోకి కాల్పులు జరిపి వ్యాపారి కుటుంబ సభ్యులను బెదిరించింది. ఇల్లును దోచుకోవడానికి ప్రయత్నించగా.. వ్యాపారి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వ్యాపారి ఇంటిని చుట్టుముట్టారు. ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించి రెండున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించిన ఈ వ్యవహారంలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. సదరు వ్యాపారిని దోచుకోవడానికి మరో వ్యాపారే ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లు బయటపడింది. గాంధీరోడ్డులోని లక్ష్మీ సినిమా హాల్‌ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్‌ వరల్డ్‌ యజమాని చంద్రశేఖర్‌ ఇంట్లోకి బుధవారం ఉదయం ఓ దొంగల ముఠా చొరబడింది. ఇంట్లోకి వచ్చీరావడంతోనే గాలిలోకి కాల్పులు జరిపి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను బెదిరించింది. దోపిడీ ముఠా ఇల్లు దోచుకునే ప్రయత్నంలో ఉండగా చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని చుట్టుముట్టి ముఠాలోని ఐదుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దొంగల నుంచి తుపాకులు, రబ్బర్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు దొంగలు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రాథమిక విచారణలో స్థానికంగా నివసించే ఎస్ఎల్వీ ఫర్నీచర్ యజమాని ఈ దోపిడీకి ప్లాన్ చేశాడని, పథకం ప్రకారం కర్ణాటక ముఠాను రంగంలోకి దించాడని తెలిసిందని పోలీసులు వివరించారు. విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్