నేటి భారత్ న్యూస్- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరుతున్నారు. తన పర్యటనలో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధానితో ఆయన చర్చిస్తారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పంపిస్తామని... బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరనున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై వారితో చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలను కూడా రేవంత్ కలవనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు సీఎం ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు 36 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ సాధించింది ఏమీ లేదని అన్నారు. ఇప్పుడు 37వ సారి ఢిల్లీకి వెళ్లి ఏం సాధిస్తారని ఎద్దేవా చేశారు.