

నేటి భారత్ న్యూస్- తెలంగాణ ఎక్సైజ్ మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లు యునైటెడ్ బేవరేజెస్ కంపెనీలో పర్యటించారు. కింగ్ ఫిషర్ బీర్ల తయారీని వారు పరిశీలించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లను ఎక్సైజ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య యునైటెడ్ బేవరేజెక్ కంపెనీకి తీసుకు వెళ్లారు. బీరు బాటిళ్లను శుభ్రపరిచే తీరు, బీరు తయారీ ప్రక్రియ, ప్యాకింగ్ విధానం వంటి అంశాలను ట్రైనీ కానిస్టేబుళ్లు పరిశీలించారు. అన్ని విషయాలను కంపెనీ క్లస్టర్ హెడ్ జయతీ షెకావత్, డిస్పాచ్ ఇంఛార్జ్ హీస్ తోష్ మహిళా కానిస్టేబుళ్లకు వివరించారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లు బీర్ తయారీని పరిశీలించడం ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఇదే తొలిసారని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.