కేసీఆర్ అలా చేసి ఉంటే ఏపీతో సమస్య వచ్చేది కాదు: రేవంత్ రెడ్డి

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తయి ఉంటే, ప్రస్తుతం నీటి విషయమై ఆంధ్రప్రదేశ్‌తో సమస్యలు తలెత్తేవి కావని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కేసీఆర్‌ను గద్దె దించి తాము అధికారంలోకి వచ్చామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ను విమర్శించేందుకు ముఖ్యమంత్రి స్థాయి సరిపోదా అని ఆయన ప్రశ్నించారు. మంద కృష్ణ మాదిగ అంటే తనకు గౌరవం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, పోటీ పరీక్షల ఫలితాలకు, రిజర్వేషన్లకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. మంద కృష్ణ మాదిగ బీజేపీ నాయకుడిలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడో విడుదలైన నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అంశం వర్తించదని గుర్తించాలని సూచించారు. ఏదైనా చేయాలని చూస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆయన హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని ముఖ్యమంత్రి అన్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసి తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పరిమితమైన కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 39 సార్లు కాకుంటే 99 సార్లు ఢిల్లీకి వెళతామని, నిధుల కోసం వెళితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్