కొడాలి నాని రూ. 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు… తక్షణమే విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలి: వెనిగండ్ల రాము

నేటి భారత్ న్యూస్-మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు అందాల్సిన బియ్యం బొక్కేశారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రూ. 500 కోట్ల మేర భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తక్షణమే కొడాలి నానిపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు.కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి జేసీ అండతో భారీ స్కామ్ చేశారని వెనిగండ్ల తెలిపారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించిన రేషన్ బియ్యం దోచేశారని ఆరోపించారు. గుడివాడలో 40 వేల రేషన్ కార్డులు ఉండగా… కేవలం 12 వేల కార్డులకు మాత్రమే బియ్యం సరఫరా చేసి మిగిలిన బియ్యం దోచేశారని చెప్పారు. కేవలం గుడివాడలోనే ఈ మేరకు అవినీతికి పాల్పడితే… మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కొడాలి నాని అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు. ఆయనకు సహకరించిన అధికారులు, రైసు మిల్లర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్