చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

నేటి భారత్ న్యూస్- ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని… మొత్తం 175 సీట్లలో 164 సీట్లను కట్టబెట్టి ఘన విజయం అందించారని చెప్పారు. కూటమికి 21 ఎంపీ స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నామని చెప్పారు. రాష్ట్రం బాగుండాలని చంద్రబాబు కోరుకుంటారని… చంద్రబాబే తనకు స్ఫూర్తి అని… ఆయన స్ఫూర్తితోనే తాను పని చేస్తున్నానని తెలిపారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని… ఆయన 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు పవన్ భూమిపూజ చేశారు. అనంతరం పూడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పల్లె పండుగ విజయవంతం కావడానికి చంద్రబాబే కారణమని పవన్ కితాబునిచ్చారు. రాయలసీమలో నీటి కష్టాలు ఎక్కువగా ఉండేవని చెప్పారు. భారీ వర్షాలు పడితే నీటి నిల్వ సౌకర్యం రాయలసీమలో లేదని అన్నారు. మే నెలలోపు లక్ష 55 వేల నీటి కుంటలు పూర్తి కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని… వర్షాల సమయంలో ఈ కుంటలన్నీ నిండితే ఒక టీఎంసీ నీళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టు రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్షించారు.  రాష్ట్రం బాగుండాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని… ఆయనను ప్రేరణగా తీసుకుని తనకు అప్పగించిన శాఖలన్నింటినీ బలోపేతం చేస్తున్నానని చెప్పారు. ఒకేరోజు 13,326 గ్రామసభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించి ప్రపంచ రికార్డు సాధించామని అన్నారు. రాష్ట్రంలో 52.92 లక్షల కుటుంబాల్లో 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకు స్వగ్రామాల్లో ఉపాధి కల్పించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 4 వేల పైచిలుకు రోడ్లు మాత్రమే నిర్మించారని… ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లోనే దాదాపు 4 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందని పవన్ వెల్లడించారు. 100 మందికి పైగా జనాభా ఉన్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీటితో పాటు మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.

Related Posts

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

నేటి భారత్ న్యూస్- లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని, డీలిమిటేషన్‌ను ప్రశ్నించని పక్షంలో చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు…

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- చెన్నైలో జరిగిన మాఫియా ముఠా సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకొనే హాజరయ్యాయని ఆరోపించారు. ఆ రెండు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ