చిరంజీవికి ముద్దు పెట్టిన మ‌హిళా అభిమాని… నెట్టింట ఫొటో వైర‌ల్‌!

నేటి భారత్ న్యూస్- యూకే పార్ల‌మెంట్‌లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవ‌డానికి మెగాస్టార్ చిరంజీవి లండ‌న్ చేరుకున్న విష‌యం తెలిసిందే. దీంతో అక్క‌డి హీత్రూ విమానాశ్ర‌యంలో చిరుకు అభిమానులు, తెలుగు ప్ర‌వాసుల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ క్ర‌మంలో మెగాస్టార్‌కు బుగ్గ‌పై ఓ మ‌హిళా అభిమాని ముద్దుపెట్టి త‌న అభిమానాన్ని చాటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా, “చిన్న‌ప్పుడు చిరంజీవి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాల‌ని అల్ల‌రి చేసిన నేనే, మా అమ్మ‌ను మెగాస్టార్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లా” అని ఆ లేడీ ఫ్యాన్ కుమారుడు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా త‌న ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలాఉంటే.. చిరంజీవికి ఈరోజు యూకే పార్ల‌మెంట్‌లో జీవిత సాఫ‌ల్య పుర‌స్కారంతో స‌త్క‌రించ‌నున్నారు. నాలుగు దశాబ్దాల‌కు పైగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ బ్రిటన్ కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ ఎంపీ న‌వేందు మిశ్రా… మెగాస్టార్‌ను ఇతర ఎంపీల సమక్షంలో స‌న్మానించ‌నున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ… సినిమా, ప్రజాసేవ.. దాతృత్వానికి చిరు చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేయనుంది.  

Related Posts

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమైన విషయం విదితమే. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అటు నియోజకవర్గానికి కానీ, ఇటు అసెంబ్లీకి కానీ వెళ్లడంలేదు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల…

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

నేటి భారత్ న్యూస్త– మిళనాడులోని తిరువణ్ణామలై కొండపై ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాన్స్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలైను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ