చిరంజీవి సినిమాపై కీలక అప్ డేట్ ఇచ్చిన నేచురల్ స్టార్ నాని

నేటి భారత్ న్యూస్ – మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇకపై తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంటుందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు హీరో నాని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి నాని కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.  చిరంజీవి సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వేసవికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు. నాని విషయానికి వస్తే… ప్రియదర్శి ప్రధాన పాత్రలో నాని సమర్పణలో ‘కోర్ట్’ సినిమా తెరకెక్కింది. వచ్చే నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి నాని ప్రచార కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని మాట్లాడుతూ… చిరంజీవి సినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌