

నేటి భారత్ న్యూస్-శుక్రవారం రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 50 పరుగుల తేడాతో చెన్నైను బెంగళూరు చిత్తు చేసింది. దీంతో చెపాక్ మైదానంలో సీఎస్‌కేపై 17 ఏళ్ల తర్వాత విక్టరీ అందుకున్న ఆర్‌సీబీ సంతోషంతో ఉప్పొంగిపోయింది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. Hanumankind (Run it Up) పాటకు స్టెప్పులేస్తూ అంతా సందడి చేశారు. ఈ విజయం తమకెంతో ప్రత్యేకమంటూ ఆర్‌సీబీ ప్లేయర్ల సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో పంచుకుంది.