ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం మారిన ర్యాంకులు.. కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ శర్మ

నేటి భారత్ న్యూస్- ట్రోఫీ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి మూడవ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు.  ఫైనల్‌లో 83 బంతుల్లో 76 పరుగులు చేసిన రోహిత్ 756 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి చేరుకున్నాడు. శుభ్‌మన్ గిల్ 784 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 770 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 243 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ 8వ స్థానంలో నిలకడగా ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ మూడవ స్థానానికి, రవీంద్ర జడేజా పదవ స్థానానికి చేరుకున్నారు. కుల్దీప్ యాదవ్ ఛాంపియన్స్ ట్రోఫీలో 7 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ కూడా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మెరుగుదల కనబరిచారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ (9 వికెట్లు) రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్