జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

నేటి భారత్ న్యూస్- బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీశ్ రెడ్డిని శాసన సభ నుండి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి అగౌరవంగా ఏమీ మాట్లాడలేదని అన్నారు. ఆయన అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడలేదని, అయినా సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయనను సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. స్పీకర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆయన చేసిన తప్పేమిటో వివరణ ఇచ్చే సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయాలని, సభ సజావగా జరిగేందుకు సహకరించాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఇదే విషయాన్ని సభాపతికి, మంత్రి శ్రీధర్ బాబుకు స్పష్టంగా చెప్పామని ఆయన తెలిపారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవాలని తాము కోరినప్పటికీ, తమ మాటలు పట్టించుకోలేదని అన్నారు. సభను ఐదు గంటల పాటు వాయిదా వేసి, ఆ తర్వాత నలుగురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడించి, సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఇది ఏకపక్ష నిర్ణయమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌