జగన్ పర్యటనకు అనుమతి నిరాకరణ

వైసీపీ అధినేత జగన్ నేడు గుంటూరు మిర్చియార్డులో రైతులను కలవాల్సి వుంది. అయితే, ఆయన పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉందని… అందువల్ల పర్యటనకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, నిబంధనలను అతిక్రమించి మిర్చియార్డుకు ఎవరైనా వస్తే అరెస్ట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.  మరోవైపు, మిర్చి రైతుల పరామర్శకు, ఎన్నికల కోడ్ కు సంబంధం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాము పబ్లిక్ మీటింగులు పెట్టడం లేదని, రైతుల సమస్యలు మాత్రమే వింటామని తెలిపారు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు.ఇంకోవైపు, జగన్ పర్యటనకు వైసీపీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పర్యటన షెడ్యూల్ ను వైసీపీ విడుదల చేసింది. దాని ప్రకారం, ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ బయల్దేరుతారు. 11 గంటలకు మిర్చియార్డుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మిర్చియార్డులో రైతులతో చర్చించి… తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. పర్యటనకు ఈసీ అనుమతి నిరాకరించడంతో… జగన్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది.

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌