జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన మహిళా ఎస్సై జుట్టు పట్టుకొని కొట్టిన యువకులు

నేటి భారత్ న్యూస్- ఓ జాతరలో అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్సైపై కొందరు యువకులు దాడిచేసి, ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామంలో ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’ కార్యక్రమం నిర్వహించారు. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు హంగామా చేస్తూ డ్యాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్సై బి.దేవి వారిని వారించే ప్రయత్నం చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన యువకులు ఎస్సైపై దాడిచేశారు. ఆమె జుట్టు పట్టుకుని కొట్టారు. దీంతో ఆమె వారి నుంచి తప్పించుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వదలని నిందితులు అక్కడికి కూడా వెళ్లి నానా రభస చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సైకి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Related Posts

జడ్జి ఎదుట భోరున విలపించినా దక్కని ఊరట… పోసానికి 14 రోజుల రిమాండ్

నేటి భారత్ న్యూస్- సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో…

తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారు: రేవంత్ రెడ్డి

నేటి భారత్ న్యూస్- ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ సమస్య అంశం తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేసుకున్నారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

జడ్జి ఎదుట భోరున విలపించినా దక్కని ఊరట… పోసానికి 14 రోజుల రిమాండ్

జడ్జి ఎదుట భోరున విలపించినా దక్కని ఊరట… పోసానికి 14 రోజుల రిమాండ్

 జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన మహిళా ఎస్సై జుట్టు పట్టుకొని కొట్టిన యువకులు

 జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన మహిళా ఎస్సై జుట్టు పట్టుకొని కొట్టిన యువకులు

తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారు: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారు: రేవంత్ రెడ్డి

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం మారిన ర్యాంకులు.. కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ శర్మ

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం మారిన ర్యాంకులు.. కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ శర్మ

ఫీజు పోరు అని పేరు పెట్టి.. ఆ తర్వాత యువత పోరు అని మార్చారు: నారా లోకేశ్

ఫీజు పోరు అని పేరు పెట్టి.. ఆ తర్వాత యువత పోరు అని మార్చారు: నారా లోకేశ్

 క్షుద్ర పూజలు.. ముంబైలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీల సంచలన ఆరోపణలు

 క్షుద్ర పూజలు.. ముంబైలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీల సంచలన ఆరోపణలు