టీడీపీ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది: డీప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌

నేటి భారత్ న్యూస్- తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయుడు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. టీడీపీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంద‌న్నారు. టీడీపీ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా పోస్ట్ పెట్టారు.  “1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగు దేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీ. శే శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచింది. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్ర‌బాబు నాయుడుకు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు, రాష్ట్ర అధ్యక్షులు ప‌ల్లా శ్రీనివాస్‌కు, నాయకులకు, కార్యకర్తలకు 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ప‌వ‌న్ ట్వీట్ చేశారు. 

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!