ట్రంప్, మస్క్‌కు భారీ షాకిచ్చిన డోజ్ ఉద్యోగులు

నేటి భారత్ న్యూస్- సాంకేతిక, నిర్మాణాత్మక సవరణల ద్వారా ఫెడరల్ ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్) ఉద్యోగులు 21 మంది నిన్న మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో తాము భాగం కాలేమంటూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన వారిలో ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, ప్రొడక్ట్ మేనేజర్లు ఉన్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగుల తొలగింపునకు తమ నైపుణ్యాలను వినియోగించలేమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. అమెరికన్ ప్రజలకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశామని, అధ్యక్ష పాలనా వ్యవస్థలో రాజ్యాంగ విలువలు నిలబెడతామని ప్రమాణం చేశామని, ఇప్పుడు దానిని ఉల్లంఘంచి ఉద్యోగాల్లో కొనసాగలేమని సంయుక్త రాజీనామా లేఖలో వారు పేర్కొన్నారు. కాగా, ఫెడరల్ ప్రభుత్వ సైజును తగ్గించేందుకు బిలియనీర్ మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డోజ్‌లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నవారే అధికంగా ఉన్నారని, లక్ష్య సాధనలో వారికి ఎలాంటి నైపుణ్యం కానీ, అనుభవం కానీ లేవని వారు ఆరోపించారు.ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా అధ్యక్షుడు ట్రంప్, మస్క్‌కు ఎదురుదెబ్బగానే చెబుతున్నారు. కాగా, ట్రంప్ అధికారం చేపట్టగానే మస్క్ నేతృత్వంలో డోజ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇది రద్దు చేసిన కాంట్రాక్టుల్లో 40 శాతం నిరుపయోగమైనవేనని తేలింది. గత వారం నాటికి డోజ్ ఏకంగా 1,125 కాంట్రాక్ట్‌లను రద్దు చేసింది. వాటిలో 417 కాంట్రాక్టుల రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేలింది.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌