ఢిల్లీకి వెళుతున్న అమెరికా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా ఫైటర్ జెట్లు.. రోమ్‌లో అత్యవసర ల్యాండింగ్..

 నేటి భారత్ న్యూస్- న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బాంబు బెదిరింపు హెచ్చరికల నేపథ్యంలో రోమ్‌కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే, ఈ-మెయిల్ ద్వారా అందుకున్న బాంబు బెదిరింపు ఒట్టిదేనని ఆ తర్వాత నిర్ధారించారు. విమానం రోమ్‌లోని లియోనార్డో డావిన్సీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీ అనంతరం విమానానికి క్లియరెన్స్ వచ్చిందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు. నేడు (సోమవారం) తిరిగి విమానం ఢిల్లీకి బయలుదేరుతుందని చెప్పారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ‘బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్’ ఆదివారం రాత్రి 199 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది. విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతుండగా విమానంలో బాంబు ఉన్నట్టు పైలట్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే విమానాన్ని ఇటలీ రాజధాని రోమ్‌కు మళ్లించారు. సమాచారం అందుకున్న ఇటలీ ఎయిర్‌ఫోర్స్ అధికారులు అమెరికన్ విమానానికి ఎస్కార్ట్‌గా యుద్ధ విమానాలను పంపించారు.  వాటి రక్షణ మధ్య అమెరికా విమానం సురక్షితంగా రోమ్‌లో ల్యాండ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను దింపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అనంతరం బాంబ్ బెదిరింపు కాల్ ఒట్టిదేనని తేల్చి విమానం ఢిల్లీకి వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.  

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌