

నేటి భారత్ న్యూస్- టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బలహీనత ఏమిటో వెల్లడించాడు. ఇటీవలి కాలంలో కోహ్లీ కవర్ డ్రైవ్ కోసం ప్రయత్నిస్తూ.. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లో మాత్రం అద్భుత కవర్ డ్రైవ్‌లతో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. దీనిపై విరాట్ కోహ్లీ స్పందించారు. బీసీసీఐ పోస్టు చేసిన వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. గత కొన్నాళ్లుగా కవర్ డ్రైవ్ తన వీక్నెస్గా మారిందన్నారు. కవర్ డ్రైవ్ ఆడబోయి చాలా సార్లు అవుట్ అయ్యానని, కానీ అదే షాట్‌తో తాను చాలా రన్స్ చేసినట్లు తెలిపాడు. పాకిస్థాన్‌పై తొలి రెండు బౌండరీలు కవర్ డ్రైవ్ ద్వారానే వచ్చాయన్నాడు. అలాంటి షాట్స్ అడినప్పుడు బ్యాటింగ్ నియంత్రణలోనే ఉన్నట్లు అనిపిస్తుందన్నాడు. వ్యక్తిగతంగా ఇది తనకు మంచి ఇన్నింగ్స్ అని, టీమిండియాకు ఇది మంచి విజయమని, తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.