

నేటి భారత్ న్యూస్- నిదానంగా పనిచేసేవారిని నత్తలు, తాబేళ్లతో పోల్చుతుండడం తెలిసిందే. ముఖ్యంగా తాబేలు నడకపై సామెతలు, కథలు కూడా ఉన్నాయి. అయితే ఈ వీడియో చూస్తే తాబేలు స్పీడ్ కు దిమ్మదిరిగిపోవడం ఖాయం! ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే… ఓ పెద్ద తాబేలు ఎదుట ఒక చేపను ఉంచారు. చేపను బాగా తేరిపార చూసిన తాబేలు… మెరుపు వేగంతో వెళ్లి పట్టుకుని ఆ చేపను గుటుక్కుమనిపించింది. కన్నుమూసి తెరిచేంతలా ఇదంతా జరిగిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.