తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో హీరో నితిన్‌

నేటి భారత్ న్యూస్- టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈరోజు తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకున్నారు. శుక్ర‌వారం వీఐపీ ప్రారంభ విరామ ద‌ర్శ‌న స‌మ‌యంలో శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో క‌లిసి ఆయ‌న శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నం అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో నితిన్‌కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నం చేసి శ్రీవారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.  కాగా, ఈరోజు నితిన్ న‌టించిన కొత్త సినిమా ‘రాబిన్‌హుడ్’ థియేటర్లలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. నితిన్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా యంగ్ బ్యూటీ శ్రీల‌ల న‌టించ‌గా… ఆసీస్ మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ అతిథి పాత్ర‌లో నటించ‌డం విశేషం. 

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!