

నేటి భారత్ న్యూస్- తమ అభిమాన నటీనటులపై ఫ్యాన్స్ చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. కోలీవుడ్‌లోనైతే అభిమానులు తమ అభిమాన కథానాయికలకు ఏకంగా గుళ్లు కట్టించిన దాఖలాలు ఉన్నాయి. ఇదే కోవలో తాజాగా ఓ తెలుగు అభిమాని హీరోయిన్ సమంతకు గుడి కట్టించి పూజించడం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువకుడు తన అభిమాన నటి కోసం ఇలా గుడి కట్టేశాడు. సమంత మంచి మనసు నచ్చి ఆమెకు అభిమానిగా మారిపోయానని తెనాలి యువకుడు చెప్పాడు. దీంతో తన ఇంటి స్థలంలోనే గుడి కట్టి అందులో సమంత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఇక సమంత గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. విజయ్‌తో నటించిన ఖుషీ మూవీ తర్వాత సామ్ మరో తెలుగు చిత్రం చేయలేదు. అటు అనారోగ్య సమస్యలు కూడా కొంతకాలం పాటు ఆమెను వేధించాయి. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ కోలుకున్నారు.