తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. 14 మంది ఎస్పీలకు స్థానచలనం కలిగింది.కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా గౌస్ ఆలం, అదనపు డీజీ (పర్సనల్)గా అనిల్ కుమార్‌లను నియమించారు. అనిల్ కుమార్‌కు ఎస్పీఎఫ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఐజీగా శ్రీనివాసులు, వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్, నిజామాబాద్ సీపీగా సాయిచైతన్య, రామగుండం సీపీగా అంబర్ కిశోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మ, భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యాదవ్, మహిళా భద్రతా విభాగం ఎస్పీగా చేతన, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్‌లను బదిలీ చేసింది.కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్, రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్, వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్, సూర్యాపేట ఎస్పీగా నర్సింహ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, ఎస్ఐబీ ఎస్పీగా సాయి శేఖర్, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సీఐడీ ఎస్పీగా రవీందర్‌లు బదిలీ అయ్యారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్