కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,(నేటి భారత్) ఫిబ్రవరి 18 : అత్యవసర విభాగంలో పనిచేసే పోలీసులకు డ్రైవింగ్ నైపుణ్యత చాలా ముఖ్యం.*
*జిల్లా పోలీసు శాఖలోకి 189 మంది నూతన పోలీసు కానిస్టేబుల్స్ చేరిక*
*సివిల్ కానిస్టేబుల్స్ -115, ఆర్మ్డ్ కానిస్టేబుల్స్-74*
*నూతనముగా పోలీసు శాఖలో చేరిన కానిస్టేబుల్స్ అందరికీ సబ్ డివిజన్ వారీగా మోటార్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ తరగతుల ఏర్పాటు*
*మహిళా కానిస్టేబుల్స్ తో ప్రత్యేకముగా క్విక్ రియాక్షన్ టీం (QRT) ఏర్పాటు*
*జిల్లా ఎస్పీ సింధుశర్మ ఐపిఎస్ వెల్లడి*
జిల్లా పోలీస్ కార్యలయంలో జిల్లా ఎస్పీ సింధుశర్మ ఐపిఎస్ ఆదేశానుసారం జిల్లాలోని కొత్తగా నియామకం అయిన అన్నీ పోలీస్టేషన్లలో సిబ్బంది మరియు ఆర్మ్డ్ రిజర్వు సిబ్బందికి అత్యవసర పరిస్థితులలో సిబ్బంది అందరికీ డ్రైవింగ్ రావాలని ముఖ్య ఉద్దేశంతో ఆరు వారాల పాటు మోటార్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ తరగతులు వారి సబ్ డివిజన్లలో మరియు ఏ ఆర్ హెడ్ క్వార్టర్ నందు నిర్వహిచడం జరగుతుంది.
జిల్లాలో పోలీస్ శాఖలోకి పురుషులతో పాటు మహిళా పోలీసు కానిస్టేబుల్స్ 9 నెలల శిక్షణ ముగించుకొని గత సంవత్సరం నవంబర్ నెలలో కామారెడ్డి జిల్లాలలో రిపోర్ట్ చేయడం జరిగింది. మొత్తం 189 పోలీసు కానిస్టేబుల్స్ కొత్తగా రిపోర్ట్ చేయగా వారి వివరములు ఈ విధముగా ఉన్నవి. సివిల్ కానిస్టేబుల్స్ ఆర్మ్డ్ రిజర్వు కానిస్టేబుల్స్
మొత్తం పురుషులు మహిళలు
75 40 58 16 189
అదేవిధంగా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారికి ముఖ్యముగా డ్రైవింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చాలా మంది వాహన డ్రైవింగ్ సరిగ్గా నడపడం రాక, రహదారి భద్రత నియమ నిబందనలు తెలియక రోడ్డు ప్రమాదాల భారీనా పడుచున్నారని కావున అందరికీ కూడా సబ్ డివిజన్ ల మరియు విడతల వారీగా డ్రైవింగ్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పటికే కామారెడ్డిజిల్లాలో (75) మంది పోలీసు కానిస్టేబుల్స్ కు శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా వారికి కూడా డ్రైవింగ్ పై పూర్తి పట్టు వచ్చే విధంగా శిక్షణ అందిస్తాము.
మహిళా కానిస్టేబుల్స్ తో జిల్లాలో ప్రత్యేకముగా క్విక్ రియాక్షన్ టీం (QRT) ఏర్పాటు
ఎస్పీ ఆదేశానుసారం జిల్లాలోని మహిళా కానిస్టేబుల్ లతో ప్రత్యేకముగా ఒక క్విక్ రియాక్షన్ టీం (QRT) జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. వీరు ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న అధికారులకు మహిళలను అదుపు చేయటములో శాంతి భద్రతలను కాపాడటములో సహాయపడుతారు. అదేవిధంగా జిల్లా పట్టణ కేంద్రం మరియు వివిద పోలీసు స్టేషన్ ల పరిదిలో వాహన తనిఖీలు చేయడం, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మరియు వివిధ రద్దీగల ప్రదేశాలలో తనిఖీలు చేస్తారు.